కర్నూలు జిల్లాలో సీపీఎం కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి

  • ఓర్వకల్లు మండలంలోని కేతవరంలో ఘటన
  • కార్యాలయం ఎదుట పార్క్ చేసిన ట్రాక్టర్లను తీయమన్నందుకు దాడి
  • ఐదుగురు కార్యకర్తలకు గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, కేతవరంలో సీపీఎం, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు సీపీఎం కార్యకర్తలకు గాయాలయ్యాయి. పార్టీ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు తీసేయమని కోరిన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన సీపీఎం కార్యకర్తలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Go Back to Shorts
Kurnool District
CPM
YSRCP

More Telugu News